అమ‌ర‌వీరుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. మొద‌ట‌గా పోలీసులు అమరవీరులకు గన్‌ సెల్యూట్ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. అనంత‌రం అమ‌ర‌వీరుల‌పై ప్ర‌ద‌ర్శించిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సీఎం కేసీఆర్, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు తిల‌కించారు. అమ‌రుల స్మార‌క కేంద్రంలో విశాల‌మైన స‌భా మందిరం, ఉద్య‌మ ప్ర‌స్థాన చిత్ర ప్ర‌ద‌ర్శ‌న కోసం థియేట‌ర్, ఉద్య‌మ ప్ర‌స్థానాన్ని వివ‌రించే ఫోటో గ్యాల‌రీ, ఉద్య‌మ చ‌రిత్ర‌కు సంబంధించిన గ్రంథాల‌యం, ప‌రిశోధ‌నా కేంద్రం ఏర్పాటు చేశారు.

Spread the love