క్రీడాకారుల పక్షపాతి సీఎం కేసీఆర్..

– మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్.
నవ తెలంగాణ- సూర్యాపేట
క్రీడాకారుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బుధవారం స్థానిక 9 వ వార్డులో క్రీడాకారులకు కెసిఆర్ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశానుసారం వార్డులో యూత్ క్రీడాకారులకు కేసిఆర్ స్పోర్ట్స్ కిట్టును అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామంజులరెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బత్తుల జానీ, బొలెద్దు దశరథ, గుండగాని నాగభూషణం 9వ వార్డు యూత్ అధ్యక్షులు మచ్చ రాము, క్రీడాకారులు, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love