దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలకపాత్ర

– డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు దాశబ్ది ఉత్సవాలలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. నేడు దూర్కి, మిర్జాపూర్, రైతు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నసురుల్లాబాద్ లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణా ఖ్యాతిని దేశ నలుమూలల చాటి చెప్పుందుకు గాను టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏండ్లల్లో కేసిఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ఎన్నో రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రం లో అమలు అవుతున్న పథకాలకు మహారాష్ట్ర ప్రజలు, నాయకులు ఆకర్షితులై బీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని, తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడంలేదని అన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ కక్ష కట్టి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలో ప్రత్యేకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు, కళ్యాణలక్ష్మీ,రైతు బీమా, ఉచిత కరెంట్, వంటి పథకాలు ఎక్కడా లేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు. అందుకే రైతుల కష్టాలు తెలుసుకొని రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. గతంలో వ్యవసాయం కోసం రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చేవారు. నేడు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. దేశంలో రైతులు చనిపోతే ఎక్కడ కూడా రూపాయి ఇవ్వడం లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రూ. 5 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఉచిత విద్యుత్తు వద్దు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్రాన్ని అడిగితే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒప్పుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు కులం, మతం, ప్రాంతం లేదన్నారు. పేదలు, అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు మంజూరు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మజీద్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గంగారం, గ్రామ కమిటీ అధ్యక్షుడు కంది మల్లేష్, నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, మోహన్ నాయక్, వైశాగౌడ్, నర్సింలు గౌడ్, సాయగౌడ్, భూమయ్య, సొసైటీ కార్యదర్శి నరేందర్, శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి దత్తతేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love