– ₹ 2,25,000/ లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద మంజూ రైన చెక్కులను బాధితులకు ఆదివారం ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుంన్నా సీఎం కేసీఆర్ అని, రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తుందని వివరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని,రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అనంతరం డిచ్ పల్లి మండలంలోని కోరట్ పల్లి గ్రామానికి చెందిన యం. నడిపి గంగారం కు రూ.₹ 1 ఓక లక్షల రూపాయల చెక్కును, యం.హనుమంతు కు.₹ 1,25,000 లక్షల రూపాయల చెక్కును పంపిణీ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.