భయం పోగొట్టి భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌

జిల్లా కేంద్రంలో పోడు భూముల పట్టాల పంపిణీ ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి
సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
గిరిజనులకు భయం పోగొట్టి భరోసా కల్పిస్తూ గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా రు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గిరిజనులకు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. జిల్లాలో 436 మంది లబ్దిదారులకు 553 ఎకరా ల భూమిపై హక్కులు కల్పిస్తున్నట్లు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి తెలిపారు. గిరిజనులు సాగు చేస్తున్న పొలంలో భయం పోగొట్టి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప సం చలన నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం గిరిజనులకు పోడుభూముల పట్టా ల పంపిణీ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలిపారు. గిరిజన జాతి చరిత్రలో పోడు పట్టాల పంపిణీ సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భమని లక్షా యాభై ఒక్క వేల మంది ఏకకాలంలో 4 లక్షల ఎకరాలకు భూయజ మా నులు కాబోతున్నారన్నారు. అనేక సమీక్షలు చేసి, అనేక మందితో చర్చించి పోడు భూముల పట్టాల నిర్ణయంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ‘మా తండాలో మా పాలనే’ అన్న నినాదాన్ని సాకారం చేస్తూ 500 జనాభా ఉ న్న 3 వేలపై చిలుకు తండాలకు గ్రామ పంచాయతీ లుగా మార్చటంతో ఆయా గ్రామాల్లో వారే సర్పంచ్లుగా ఉన్నార న్నారు. జిల్లాలోని తండాలలో కనీస సౌకర్యాల కల్పనకు 15 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడే ఎస్‌సి, ఎస్టీలకు ప్రభుత్వం విద్యుత్‌ అం దిస్తుందన్నారు. జిల్లాలో 7 వేల ఇళ్లకు 100 యూనిట్ల ఉచి త విద్యుత్‌ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సేవాలా ల్‌ మహరాజ్‌ గారి జయంతి, వర్థంతిలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. బంజారాల పేరు మీద ఉ న్న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోనే బంజారా భవన్‌ నిర్మించేలా సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చి పూర్తి చేసి బంజారా ఆత్మగౌరవ భవనం పూర్తి చేయించారన్నారు. 2 కోట్లతో జిల్లాలోని 4 నియోజకవర్గలలో బంజారా భవన్‌లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై 1లక్ష 25 వేలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 20 లక్షల ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌లు అందిస్తూ విద్యార్థుల విదేశీ విద్య కలను సీఎంకేసీఆర్‌ సాకా రం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతు కు ఆనంద్‌, కొప్పుల మహేశ్వర రెడ్డి, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజరు కుమార్‌, ఆయా మండలాల జడ్పీ టీసీ, ఎంపీపీలు, గిరిజనులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love