కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్‌ మొదట నేరుగా కొప్పుల మహేష్‌ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి సతీమణి గిరిజాదేవిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ వెంబడి మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కేశవరావు, ఎంపీ రంజిత్‌ రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఎమ్మెల్యే కోప్పుల మహేష్‌ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love