ఈరోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేడు అసెంబ్లీ టికెట్లు ప్రకటించనుంది. ఈ సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇక ఈరోజు మధ్యాహ్నం 12:03 గంటలకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా 105 సీట్లను సీఎం కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే.. బీఆర్ఎస్ నేడు విడుదల చేసే జాబితాలో ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి, ఖానాపూర్ లో రేఖా నాయక్ బదులు జాన్సన్, బోధ్ లో అనిల్ జాదవ్/నగేష్, వైరాలో రాములు నాయక్ స్థానంలో మదన్ లాల్, వేములవాడలో రమేష్ స్థానంలో లక్ష్మీనరసింహారావు, జనగామలో ముత్తిరెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి/శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ గన్ పూర్ లో రాజయ్య స్థానంలో కడియం పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Spread the love