కాలేశ్వరం పేరిట డబ్బులు దోచుకున్న సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ-సిద్దిపేట
కాలేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పేరిట సీఎం కేసీఆర్‌ భారీ ఎత్తున డబ్బులు దోచుకున్నారని పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు అమరేందర్‌ సింగ్‌ ఆరోపించారు. సిద్దిపేటలో సోమవారం పీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికష్ణ, పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌ ఆధ్వర్యంలో 28 వార్డు ముర్షద్‌ గడ్డలో గడపగడపకు పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు అమరేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అవినీతి పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును రాష్ట్ర ప్రజల అదష్టం మేరకు సోనియా గాంధీ ప్రకటించారన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయి అనుకుంటే సీఎం కేసీఆర్‌ కుటుంబం తప్ప మిగతా ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కోట్లది రూపాయలు ధనాన్ని సంపాదించుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. మహిళలు, యువత ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదనీ అన్నారు. కేంద్రంలో 9 ఏళ్ల పాలనలో మోడీ నిత్యవసర సరుకులు, గ్యాస్‌ , పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు పెంచి సామాన్యుల ప్రజల నడ్డి విరిచారని అన్నారు. కేవలం కార్పొరేట్‌ సంస్థలు ఆదాని, అంబానీలు బాగుపడేందుకే మోడీ పని చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేస్తుందని, అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌ పథకాలను చూస్తే బీజేపీ, బీఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించి, గ్యారెంటీ స్కీం పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ తాడూరి శ్రీనివాస్‌ గౌడ్‌, మద్ది చంద్రశేఖర్‌ రెడ్డి, గూడూరు శ్రీనివాస్‌, బొమ్మల యాదగిరి, సూర్య వర్మ, మార్క సతీష్‌ గౌడ్‌, లక్ష్మీ, మజార్‌ మాలిక్‌ , మండల అధ్యక్షులు తప్పేట శంకర్‌, మిట్టపల్లి గణేష్‌, బిక్షపతి, రాములు, బర్మా రామచంద్రం, కళిముద్దీన్‌, వహాబ్‌, గోపికష్ణ, గయాజుద్దీన్‌, రశద్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love