నేడు నాగపూర్​లో బీఆర్​ఎస్​ కార్యాలయం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్
భారత్ రాష్ట్ర సమితి పార్టీ మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. బీఆర్​ఎస్​ను ఎప్పుడైతే స్థాపించారో ఆరోజు నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. మహారాష్ట్ర నుంచే బీఆర్​ఎస్​ దేశరాజకీయాల్లో ప్రవేశించాలని.. అందుకు నాగపూర్​నే సరైన వేదికని తొలినాళ్లలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ చెప్పేవారు. అందుకే పార్టీ తొలి కార్యాలయాన్ని నాగపూర్​లో ఏర్పాటు చేయాలని కేసీఆర్​ భావించారు. అందులో భాగంగా గురువారం కేసీఆర్​ అక్కడకు వెళ్లి.. పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ముచ్చటించి.. వారిలో జోష్​ నింపనున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు.

Spread the love