నేడు పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్ సభలు

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికలకు ఏ మాత్రం సమయం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండో విడత ప్రచారాన్ని ప్రారంభిచారు. నిన్నటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం మొదలు అయింది. ఇందులో భాగంగా నిన్న అశ్వరావుపేట, పినపాక, భద్రాచలం మరియు నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మొత్తంగా 16 రోజులపాటు ఆయన రెండో విడత ప్రచారంలో పాల్గొంటారు. ఈ 16 రోజులలో 54 నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారన్నమాట.ఇక ఇవాళ పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్ సభలు ఉంటాయి. ఈనెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో బహిరంగ సభతో తన ప్రచారాన్ని ముగిస్తారు.

Spread the love