పదేండ్లు రేవంతే సీఎం: మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి పదేండ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ శిందేలు ఎవరూ లేరని.. ఆయన్ను సృష్టించిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్‌ నాయకత్వంలో పని చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.

Spread the love