నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అందరూ ఏఐసీసీ ప్రధాన కార్యాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ తో సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బుధవారం కూడా సీఎం ఢిల్లీలోనే ఉండి రాష్ట్రంలో చేపడుతోన్న పలు అభివృద్ధి పనులకు నిధుల సమీకణ విషయంలో కేంద్ర మంత్రులను వినతులు ఇవ్వనున్నారు. గరువారం ఉదయం ఆయన నేరుగా అక్కడి నుంచి సింగపూర్ వెళ్లి ఈనెల 16 నుంచి 19 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు వెళ్లనున్నారు.