నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సెటైర్లు కురిపించారు. సింగపూర్ పార్లమెంట్‌లో రెండు అబద్ధాలు చెప్పిన ఎంపీకి 14వేల డాలర్ల జరిమానా విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరి కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, నాలుగు వేల పింఛన్లు అని, మహిళలకు రూ.2500 అని.. ఇలా 420 అబద్ధాలు చెప్పిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి4.20 లక్ష కోట్ల జరిమా వేసిన తప్పులేదని విమర్శించారు.
సింగపూర్ పార్లమెంట్‌లో రెండు అబద్దాలు చెప్పిన ఎంపీ కి 14 వేల డాలర్ల జరిమానా!!
మరి కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పులు గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతు రుణ మాఫీ గురించి, రైతు బంధు గురించి, 4000 పింఛన్లు అని, మహిళలకు 2500 అని…
ఇట్ల 420 అబద్ధాలు చెప్పిన ముసలి నక్క… pic.twitter.com/1u5a2wfDQH
— KTR (@KTRBRS) February 19, 2025