నవతెలంగాణ – హైదరాబాద్: గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆయనకు నివాళులు అర్పించారు. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుక ఆయన అని స్మరించుకున్నారు. గద్దర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరిట నెలకొల్పిన అవార్డును కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు.