భారతీయుడు -2 చిత్ర బృందానికి సీఎం రేవంత్ అభినందనలు..

నవతెలంగాణ – హైదరాబాద్: కొత్త సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచాలని తమ వద్దకు వచ్చే సినీ ప్రముఖులు విధిగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం కోసం ఓ వీడియో రూపొందించి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా  హైదరాబాద్ లో ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉన్న భారతీయుడు -2 చిత్రబృందం కూడా డ్రగ్స్ పై అవగాహన వీడియో రూపొందించింది. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ..  “భారతీయుడు-2 చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం… ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా… కమల్ హాసన్, శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని కలిసి ఈ అవగాహన వీడియో రూపొందించడం హర్షణీయం” అని తెలిపారు. ఈ మేరకు భారతీయుడు-2 చిత్రబృందం రూపొందించిన వీడియోను ఆయన పంచుకున్నారు.

Spread the love