నవతెలంగాణ-హైదరాబాద్ : కొండపోచమ్మ సాగర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు గల్లంతవడంపై ఆయన అధికారులకు ఫోన్ చేసి కనుక్కున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకోవాలని, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి మృతదేహాలను వెలికి తీయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి.