నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న ₹1800కోట్ల గ్రాంటును విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలను సీఎం రేవంత్ కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి ₹2547cr రికవరీకి కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలిచ్చిందని, దీనిపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.