తెలంగాణను కేసీఆర్‌ దివాలా తీయించారు : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ దివాలా తీయించారని.. రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఎంఓయూపై సింగరేణి సీఎండీ బలరాం, బ్యాంకర్లు సంతకాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండాసురేఖ, సింగరేణి ఎండీ బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love