ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. త్వరలో 15వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు. సీఎం మాట్లాడుతూ.. ‘‘విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్టాఫ్‌ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో వారిదే కీలకపాత్ర. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త ఛైర్మన్‌, సభ్యులను నియమించాం. ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని వెల్లడించారు.

Spread the love