అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ..

In America CM Revanth Reddy BGBG..నవతెలంగాణ – హైదరాబాద్:  తెలంగాణకు పెట్టుబడులు, ఉపాధే లక్ష్యంగా సీఎం రేవంత్​రెడ్డి టీమ్​ అమెరికా పర్యటన సాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో ఐదు రోజుల్లోనే 10 పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కాగ్నిజెంట్, వాల్ష్​ కార్రా, స్వచ్ఛ్​ బయో, ట్రైజిన్​ టెక్నాలజీస్​ లాంటి కంపెనీలున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడ్తున్న వివిధ ప్రాజెక్టులకు వరల్డ్​బ్యాంక్ ​సహకారాన్ని సాధించడం విశేషం. ఇందులో భాగంగా న్యూయార్క్​, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్​లో పర్యటించిన సీఎం రేవంత్​ రెడ్డి టీమ్​ గురువారం కాలిఫోర్నియా చేరుకున్నది. గురువారం రోజు కాలీఫోర్నియాలోని యాపిల్ పార్క్ ని సందర్శించారు. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాలలో ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా హైదరాబాద్, తెలంగాణకు బలమైన పిచ్‌ని రూపొందించడానికి అనువైన ప్రదేశమని వివరించారు.

Spread the love