- ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
నవతెలంగాణ – ఉప్పునుంతలు: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభయ హస్తం ఆరు గ్యారెంటీల హామీలను దరఖాస్తుల ద్వారా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో శుక్రవారం కంసానిపల్లీ గ్రామంలో గ్రామ సర్పంచి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ రెండు లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచామని అర్హులైన మహాలక్ష్మి 2500 రూపాయలు, 500 కే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి, అర్హులైన వారికి ప్రజల ప్రభుత్వం అండగా ఉండి అందజేస్తామని తెలిపారు. మేము పాలకులం కాదు సేవకులమని అన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే మా లక్ష్యం అని మా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని తెలిపారు. త్వరలో భూమాత వస్తుంది భూ సమస్యలున్న దరఖాస్తుల అధికంగా వస్తున్నాయని భూమాత వచ్చిన వెంటనే న్యాయం జరుగుతుందని అన్నారు.
ప్రజాపాలన కార్యక్రమం ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని మాకోసం గంటల తరబడి వేచి ఉంచి ఉండకుండా ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశించారు. పార్టీల అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేకూరేలా పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గతంలో వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి మంచి పనులు చేశారని కొని ఆడారు. అంతకంటే మెరుగైన పాలన కొనసాగిస్తూ సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో తబితారాణి, స్పెషల్ అధికారి శ్రీధర్, ఎంపీడీవో లక్ష్మణరావు, ఎంపీ ఓ నారాయణ, జడ్పిటిసిలు, ఎంపీపీ, పంచాయతి సెక్రటరిలు, వైద్యాధికారులు, అంగన్వాడి, విద్యుత్ ఏఈ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.