మ‌రికాసేప‌ట్లో ఢిల్లీ వెళ్ల‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-  హైద‌రాబాద్ : మ‌రికాసేప‌ట్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హ‌స్తిన‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి రేవంత్ వెళ్ల‌నున్నారు. శ‌నివారం ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ(సీడ‌బ్ల్యూసీ) స‌మావేశంలో రేవంత్ పాల్గొన‌నున్నారు. సీఎం రేవంత్‌తో పాటు ప‌లువురు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లోని 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన విష‌యం తెలిసిందే.

Spread the love