రేపు మూసీ పాదయాత్ర చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

నవతెలంగాణ-హైదరాబాద్ : రేపు మూసీ పాదయాత్ర ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. అక్కడ 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని.. 11.30కు యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత 1.30కి రోడ్డు మార్గంలో సంగెం చేరుకుంటారు. ఇక సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్పంలో భాగంగా పాదయాత్ర ప్రారంభిస్తారు. మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తారు. అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథం పై నుంచి ప్రసంగం ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అవుతారు.

Spread the love