విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోం: సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘‘సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చివేసింది. జన్వాడ ఫామ్‌హౌస్‌ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో కేటీఆర్‌ ఎందుకు ప్రస్తావించలేదు? నిర్మాణాలకు అధికారులే అనుమతి ఇస్తారు.. సర్పంచులు కాదని ఆయనకు తెలియదా? నా కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్‌ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా. విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. హైడ్రా హైదరాబాద్‌కు మాత్రమే ఇప్పటివరకు పరిమితం. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌, చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకే మొదటి ప్రాధాన్యం. 30 ఏళ్ల కింద కట్టిన అక్రమ నివాస కట్టడాలైనా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. భారాస నేత హరీశ్‌రావు సిద్ధమైతే ఆయన నేతృత్వంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధరణ కమిటీ వేస్తాం. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయి.. అయినా ఎదుర్కొంటాం.. వెనక్కి తగ్గేది లేదు’’ అని సీఎం వ్యాఖ్యానించారు.

Spread the love