నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిసారు. సీఎం అయ్యాక రేవంత్ తొలిసారి జానారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ ను శాలువా కప్పి సన్మానించారు . జానారెడ్డి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయలేదు. ఆయన కుమారుడు జై వీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి గెలిచారు.