నవతెలంగాణ -హైదరాబాద్: రామోజీ రావు మృతి నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అటు ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని సీఎం సంతాపం తెలిపారు.