ముంబై నుండి ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన ఈ రోజు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ముంబైలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.

Spread the love