నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ సూసైడ్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. తన పొలాన్ని కొందరు ఆక్రమించారని, సీఎం రేవంత్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ రైతు ప్రభాకర్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.