ఎంపీ పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా

 

నవతెలంగాణ- హైదరాబాద్: ఎంపీ పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. నేరుగా పార్లమెంట్‌కు వెళ్లారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. కాగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కొడంగల్ నుండి భారీ మెజార్టీ‌తో గెవలవడంతో 14 రోజుల్లో ఆయన ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ఇవాళ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Spread the love