పెద్దపల్లిపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు

నవతెలంగాణ – హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లికి రూరల్‌ పోలీసు స్టేషన్‌, మహిళా పోలీసు స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ను మంజూరు చేశారు. ఎలిగేడు మండల కేంద్రానికి పోలీసు స్టేషన్‌, వ్యవసాయ మార్కెట్‌ను మంజూరు చేశారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. మంథనిలో 50 పడకల ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు. గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పెద్దపల్లికి 4 వరుసల బైపాస్‌రోడ్‌ మంజూరు చేశారు.

Spread the love