చిరంజీవికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలోని సినిమా థియేటర్ల యజమానులు సైబర్‌ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినీ నటులు నిమిషం నుంచి రెండు నిమిషాలు నిడివి ఉన్న వీడియోలను రికార్డు చేసి పోలీసులు, ఉన్నతాధికారులకు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.

Spread the love