17న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 17న ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. శ్రావణమాసంలో పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్‌కు సూచించారు. దీంతో ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Spread the love