నేడు లస్కర్‌గూడకు సీఎం రేవంత్‌రెడ్డి

నేడు లస్కర్‌గూడకు సీఎం రేవంత్‌రెడ్డి– గీత కార్మికులకు ‘సేఫ్టీ కిట్‌’ ప్రారంభం
– సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన
– బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యే
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గీత కార్మికుల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం ‘సేఫ్టీ కిట్ల’లను గీత కార్మికులకు అందించనుంది. ఇందులో భా గంగా ఆదివారం రంగారెడ్డి జిల్లాలో అబ్దులపూర్‌మెట్టు మండల పరిధిలోని లస్కర్‌గూడలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా సేఫ్టీ కిట్‌ను ప్రారం భించనున్నారు. ఇందులో భాగంగా శనివారం బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, కలెక్టర్‌ శశాంక, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రం గారెడ్డిలు సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. భద్రత విషయంలో పకడ్బం దీగా ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు సీఎం తమ నివాసం జూబ్లిహిల్స్‌ నుంచి బయలు దేరుతారు. 11 : 30 గంటలకు గీత కార్మికుల ‘ సేఫ్టీ కిట్‌ ‘ ను ప్రారంభించనున్నారు.

Spread the love