రైతు రుణమాఫీ తర్వాతే స్థానిక ఎన్నికలు: సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: రైతు రుణమాఫీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నేడు ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. ‘కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తాం. కార్యకర్తల కోసం నేతలంతా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.  నేను కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా’ అని వ్యాఖ్యానించారు.

Spread the love