నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు శ్రీకాంతచారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ‘నీ త్యాగం, తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తోంది. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, శ్రీకాంతచారి 13 ఏళ్ల క్రితం ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణం చేసుకున్న దృశ్యాలు నేటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో జై తెలంగాణ నినాదాన్ని రగిలిస్తూనే ఉంటాయి.