బీజేపీ అభ్యర్థుల విజయానికి బీఆర్ఎస్ కృషి: సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేశామని  సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన నచ్చితే ఓటు వేయాలని లోక్‌సభ ఎన్నికల్లో కోరామని.. 8 మంది తమ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. వందరోజుల పాలన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ‘‘అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్‌సభ ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్‌ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మేం భావిస్తున్నాం. 8 మంది ఎంపీలను గెలిపించి ఆశీర్వదించారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. 2019 ఎన్నికల్లో మాకు 3 సీట్లు వస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరింది. బీఆర్ఎస్ ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆ 7 సీట్లలో బీజేపీని గెలిపించి అవయవదానం చేశారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్‌ కృషి చేశారు. మెదక్‌లో కాషాయ పార్టీ విజయానికి హరీశ్‌రావు సహకారం అందించారు.’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Spread the love