సీఎం రేవంత్ రెడ్డి తొలి ప్రజా దర్బార్..వినతులు స్వీకరణ

నవతెలంగాణ-హైదరాబాద్ : జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు చేరుకున్నారు. వినతులతో ప్రజాదర్బార్ లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా వచ్చారు. ప్రజాభవన్ లో ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు సీఎం రేవంత్ రెడ్డి స్వీకరిస్తున్నారు.  ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.  ఎన్నికల సమయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి ప్రజా దర్బార్ కు పెద్ద సంఖ్యలో వినతులతో ప్రజలు హజరయ్యారు. జిల్లాల నుండి బాధితులు సమస్యలు చేప్పుకునేందుకు భారీగా ప్రజా భవన్ కు చేరుకున్నారు.

Spread the love