సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

నవతెలంగాణ – హైదరాబాద్:  హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాలన్నారు. ఈనెల 18న కేబినెట్ భేటీ నిర్వహించి, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించాలని CM నిర్ణయించారు. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

Spread the love