హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి టీం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయా దేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రానికి చేరుకున్న సీఎం బృందానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ శ్రేణులు స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్​నూతన క్యాంపస్‌ను సీఎం ప్రారంభించనున్నారు.

Spread the love