సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన… ఆశావాహుల్లో కొత్త ఆశలు

నవతెలంగాణ హైదరాబాద్: సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. మొదటి రెండు రోజులు కొత్తగా ఎంపికైన లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగనున్నది. ఈ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్న తెలుస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రాభివృద్ధిపై చర్చించి పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఏఐసీసీ పెద్దలతోనూ క్యాబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై, నామినేటెడ్ పదవుల భర్తీ విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పార్టీలో పదవులు ఆశిస్తున్న ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Spread the love