– అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలి..
– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
8వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 8 గంటల 30 నిమిషాలకు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శనం చేసుకుని, ఆ తర్వాత 11 గంటలలోపు సుమారు రూ.200 కోట్లతో యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచినీరు ఇచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ మీదుగా 16 కిలోమీటర్లకు శంకుస్థాపన, ఆలేరు, భువనగిరి కెనాల్స్ మూడు నదులు కలిసిన సంగెం వద్ద పాదయాత్ర చేయనున్నారు. మూసీ బ్రిడ్జి ప్రాంతం పరిశీలన, ప్రజల్ని స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మూసి పునరుజ్జీవ కార్యక్రమాన్ని ఒక వరంలా భావించి, అందరూ కలిసి రావాలి. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, నాయకులు తంగెలపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్, వాకిటి అనంతరెడ్డి, పాశం సత్తిరెడ్డి, బర్రె జహంగీర్, పింగల్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.