తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం రూ.31,532 కోట్ల పెట్టుబడులతో అమెరికా పర్యటన విజయవంతం అయిందని అన్నారు. ఈ పెట్టుబడులతో దాదాపు 30,750 ఉద్యోగాలతో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు విశేష స్పందన లభించిందన్నారు. పెట్టుబడులకు నిజమైన గమ్యస్థానం తెలంగాణ సాధించబోతుందని తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకొని ఈనెల 14న రాష్ట్రానికి తిరిగి వచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.