రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ సమీక్ష

నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ధాన్యం కొనుగోలు, వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. ఎక్కడా తాగునీరు సమస్యలు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు.

 

Spread the love