రామోజీరావు చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల మృతి చెందిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీలో నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి నుంచి ఎంపీగా గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love