సీఎం ఆర్ఎఫ్ చెక్కులతో నిరుపేదలకు మేలు.. 

– బాధిత కుటుంబానికి సీఎం ఆర్ఎఫ్ చెక్కు పంపిణీ 
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులతో ఎంతో మేలు చేకూరుతుందని పెద్దగుండవెళ్లి గ్రామ సర్పంచ్ (సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు) సద్ది రాజిరెడ్డి అన్నారు. ఎంపీ ఆదేశానుసారం శనివారం దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన పంజా రామచంద్రం కి 12 వేల రూపాయలు ,అలాగే గుండెల మల్లేశం 8 వేల ఐదు వందల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లు గారి ప్రేమ్, దుబ్బాక మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్ని సంజీవరెడ్డి తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో  బీఆర్ఎస్ నాయకుడు నవీన్   ఉన్నారు.
Spread the love