48 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేయాలి: సీఎం

నవతెలంగాణ-హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలను పక్కనపెట్టాలని సూచించారు. రైతులకు అనుకూలంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. రేషన్ షాపుల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు.

Spread the love