నవతెలంగాణ – హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్థూపం దగ్గరసీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రిపబ్లిక్ డే సందర్భంగా… అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గణతంత్ర వేడుకలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు జరగనున్నాయి. కాసేపట్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జెండా ఎగురవేయనున్నారు.