నవతెలంగాణ- న్యూఢిల్లీ: సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్),భారతదేశపు ప్రముఖ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ మరియు సలహా సంస్థ చేసిన ఒక కొత్త వినియోగదారు అధ్యయనం ప్రకారం, టైర్ 2 పట్టణాలకు చెందిన భారతీయులు ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి సగటున 2 గంటల 25 నిముషాలు సమయం వెచ్చించి, తమ ఆదాయంలో సుమారు 16% ఖర్చు చేసారు. ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికి ప్రముఖ మూడు ప్రేరేపణలలో ఒకటి ఆకర్షణీయమైన ధరలు (57%), రెండవది సౌకర్యవంతంగా వాపసు చేయడం మరియు ఎక్స్ ఛేంజ్ ప్రక్రియలు (57%), మూడు ఆకర్షణీయమైన ఆఫర్స్ (49%) నిలిచాయి. అమేజాన్ (73%) ప్రాధాన్యతనివ్వబడిన ఈ-కామర్స్ వేదికగా, తదుపరి ఫ్లిప్ కార్ట్ (70%), మీషో (30%), జియో మార్ట్ (20%) మరియు ఇతర వేదికలు ఉన్నాయని ఈ అధ్యయనం మరింతగా వెల్లడించింది. అత్యధిక సంతృప్తి పొందినట్లుగా 63% అమేజాన్ యూజర్స్ నివేదించగా, తదుపరి 52% మంది ఫ్లిప్ కార్ట్ కు మరియు రిలయెన్స్ డిజిటల్ కు 46% మంది తెలిపారు. ఆసక్తికరంగా ఆకర్షణీయమైన ధరలు (54%), సులభంగా వాపసు చేయడం/ఎక్స్ ఛేంజ్ ప్రక్రియ (52%), బ్రాండ్ నమ్మకం (40%) మరియు భారతదేశంలోని పిన్ కోడ్స్ లో సౌకర్యవంతమైన షాపింగ్ (38%) వలన యూజర్స్ అమేజాన్ ను ఇష్టపడ్డారు. గత ఆరు నెలల్లో, టైర్ II మరియు టైర్ 1 పట్టణాలు నుండి 73% వినియోగదారులు అమేజాన్ లో షాపింగ్ చేసారు. ప్రభు రామ్, హెడ్ -ఇండస్ట్రీ ఇంటిలిజెన్స్ గ్రూప్, సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇలా అన్నారు, “ఈ కామర్స్ అందించిన విస్తృత శ్రేణి ఎంపికలు, సౌకర్యం మరియు సదుపాయం ఆన్ లైన్ లో మరింతగా షాపింగ్ చేయడానికి, తమ అభిలాషలు నెరవేర్చడానికి అభిలాషణీయమైన భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న యువ వినియోగదారులకు సాధికారత కల్పించింది. ప్రధానమైన భాగస్వాములైన అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లు, మీషో మరియు ఇతరులు వంటి ఆధునిక మార్కెట్ భాగస్వాములు, టాటా మరియు రిలయెన్స్ వంటి మిశ్రమాలు ఈ మార్కెట్లలో తీవ్రంగా పోటీపడుతున్నాయి. భారతదేశంలో అమేజాన్ తన విస్తృతమైన మరియు దీర్ఘకాల ఉనికితో వినియోగదారుల నమ్మకం పొంది, వారు ప్రాధాన్యతనిచ్చిన ఎంపికగా నిలిచిందని మా పరిశోధన తెలియచేస్తోంది.” ముగ్గురిలో ఇద్దరు వినియోగదారులు గత ఆరు నెలల్లో ఆన్ లైన్ షాపింగ్ లో రూ. 20,000 ఖర్చు చేసారు. టైర్ II బయ్యర్స్ గత 6 నెలల్లో ఆన్ లైన్ కొనుగోలు సమయంలో సగటున (రూ. 20,100) ఖర్చు చేసారు, ఇది టైర్ I బయ్యర్స్ (రూ. 21, 700) ఆన్ లైన్ లో చేసిన ఖర్చుకు దాదాపుగా సమానంగా ఉంది.