సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం సంచలన ప్రకటన..

నవతెలంగాణ – హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెన్సేషనల్ ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం తనకు 77 ఏళ్లు అని.. ఇంకా నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల సమయానికి పని చేసేందుకు అవసరమైన ఆరోగ్యం, ఉత్సాహం ఉండదని తెలిపారు. అందుకే ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారని.. కానీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి 81 ఏళ్లు వస్తాయని.. అప్పుడు తన ఆరోగ్యం సహకరించదని పేర్కొన్నారు. అంత ఉత్సాహం పని చేయలేనని.. శరీరం కూడా సహకరించదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అయితే పోటీ చేయను కానీ.. రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు.

Spread the love