పిల్లల ఆత్మహత్యలపై సీఎం సంచలన వాఖ్యలు

rajastan cm`నవతెలంగాణ – రాజస్థాన్: రాజస్థాన్‌లోని కోటాలో జరుగుతున్న ఐఐటీ, నీట్ అభ్యర్థుల ఆత్మహత్యలపై అశోక్‌ గెహ్లాట్ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించింది. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు, అవసరమైన సలహాలు ఇచ్చేందుకు నిన్న ఓ నిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. 9, 10 తరగతులు చదువుతున్నప్పుడే విద్యార్థులపై విపరీతమైన భారం మోపుతున్నారని అన్నారు. ‘‘పిల్లలు 9, 10 తరగతులు చదువుతున్నప్పుడే కోచింగ్ సెంటర్లకు పంపిస్తూ తీరని నేరం చేస్తున్నారు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల తప్పే. ఓవైపు బోర్డు ఎగ్జామ్స్ కోసం చదువుతూనే, ప్రవేశ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతూ తీరని ఒత్తిడి అనుభవిస్తున్నారని అన్నారు. ఇకపై, విద్యార్థుల ఆత్మహత్యలు చూడాలనుకోవడం లేదని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని అన్నారు. ఒక్క విద్యార్థి చనిపోయినా తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలపై జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికపైనా ఈ సమావేశంలో చర్చించారు.

Spread the love